Ganapeshwara Temple
-
త్రివర్ణ గణపేశ్వరుడు
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో శ్రావణ సోమవారంతోపాటు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గణపేశ్వరుడిని జాతీయ పతాక రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముసునూరి నరేశ్స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. -
శిల్పసంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన మార్టిమ్ విలియమ్ అన్నారు. బుధవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూశానని, 21 రోజుల పాటు తెలంగాణలో తిరిగి పలు ప్రాచీన దేవాలయాలను సందర్శిస్తున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లోనూ అపురూపమైన శిల్పసంపద ఉందని, ఇవి ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. వరంగల్‌లోని కట్టడాలు, రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు. అనంతరం గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు.