కమెడియన్లుగా మారిన మాజీ క్రికెటర్లు
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్లను తమ బంతులతో బెంబేలెత్తించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్‌లు కమెడియన్లుగా మారారు. 'జియో ఖేలియో పాకిస్తాన్' అనే టెలివిజన్ గేమ్ షో కోసం ఈ మాజీ బౌలర్లు ఇద్దరూ కమెడియన్లుగా మారి ఓ యాడ్‌లో నటించారు. ఈ టీవీ షోలో షోయబ్ హోస్ట్‌గా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బౌలర్లు కలిసి నటించిన వీడియోను షోయబ్ అక్తర్ ట్వీటర్లో పోస్ట్ చేశాడు.
అక్రమ్ భాయ్ అద్భుతంగా నటించాడంటూ కితాబు కూడా ఇచ్చాడు. యాడ్‌ను తిలకించిన ట్వీటరాటీలు మాజీ క్రికెటర్లను తెగ పొగిడేస్తున్నారు. బౌలింగ్‌లోనే కాదూ కామెడీలో కూడా ఇద్దరూ ఇద్దరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి.
Our new prom shoot with Bhai saab ..
Love the act of Waz Bhai just simply brilliant ... pic.twitter.com/zcuMRthz7S
— Shoaib Akhtar (@shoaib100mph) 23 May 2017