2016 మార్చికల్లా 0.75% రేట్ల కోత: యూబీఎస్
న్యూఢిల్లీ : ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో 0.75 శాతం రెపో రేటు తగ్గిస్తుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం యూబీఎస్ అంచనావేసింది. వర్షాభావ పరిస్థితులతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండటంతో సమీప భవిష్యత్తులో ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25%) తగ్గించకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనికి భిన్నంగా యూబీఎస్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. రానున్న ఆగస్టు 2 సమీక్ష సందర్భంగా రేట్ల కోత ఉండకపోయినా, అటు తర్వాత తగ్గింపు దిశలో నిర్ణయం ఉంటుందని యూబీఎస్ విశ్లేషకుడు గౌతమ్ చెప్పారు.