నెమలి కనబడటం నాకో పాజిటివ్ సైన్: డైరెక్టర్ జ్ఞానసాగర్
సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హరోం హర’. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జ్ఞానశేఖర్ మాట్లాడుతూ –‘‘కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేసే ఓ మామూలు కుర్రాడు సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లో ఇన్వాల్స్ కావాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుణ్ణి. అందుకే ఈ సినిమాకు ‘హరోం హర’ టైటిల్, హీరోకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్లో మాకు నెమలి కనిపించింది. దీన్ని ఓ పాజిటివ్ సైన్‌గా తీసుకున్నాను. సుధీర్‌బాబుగారు అద్భుతంగా నటించారు. కథని నమ్మి, గ్రాండ్‌గా నిర్మించిన నా ఫ్రెండ్ సుమంత్‌కి ధన్యవాదాలు. ఈ సినిమాను ముందు పాన్ ఇండియాగానే అనుకున్నాం. అయితే ఇతర భాషల్లో డైలాగ్స్ సరిగ్గా కుదరలేదనిపించింది. నాకు నాలుగు భాషలు వచ్చు. నేనే కూర్చుని, పర్ఫెక్ట్గా చేయించాలంటే సినిమా రిలీజ్‌కు చాలా టైమ్ పడుతుంది. అందుకే ΄ాన్ ఇండియా రిలీజ్ వద్దనుకున్నాం’’ అన్నారు.