అడుగుడుగునా అభిమానం..
జనహృదయ నేతకు ఘనస్వాగతం
కరచాలనం చేసేందుకు పోటీపడిన యువత
జయంతి(వీరులపాడు) :
పుష్కర మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్రప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన నందిగామ నగేష్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి గురువారం ఆయన వీరులపాడు మండలం జయంతి గ్రామానికి వచ్చారు. జగన్ గ్రామానికి వస్తున్నారని తెలియటంతో ఆయనను చూసేందుకు ప్రజలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామస్తులు, నాయకులు గ్రామ శివారులోనే జగన్‌కు స్వాగతం పలికి మృతుని నివాసం వద్దకు తీసుకెళ్లారు. దారి పొడవునా జగన్‌తో కరచాలనం చేసేందుకు యువత ఒకరికొకరు పోటీ పడ్డారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో పార్టీ మండల కన్వీనర్ కోటేరు ముత్తారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు షహనాజ్‌బేగం, సర్పంచిలు కోటేరు సూర్యనారాయణ రెడ్డి, ఆవుల మాధవి, ఎంపీటీసీ సభ్యులు సాదా భారతి, ఆదాం, బాయమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్‌కు స్వాగతం పలికారు.