gorijavolu
-
కొట్టి చంపి.. గోతంలో వేసి..!
నాదెండ్ల(చిలకలూరిపేట): అదృశ్యమైన బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో చోటు చేసుకుంది. దావల యశ్వంత్‌కుమార్ (8) మృతదేహం గొరిజవోలు, సంక్రాంతిపాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నుదురుపాడుకు చెందిన లక్ష్మి 10 ఏళ్ల క్రితం దావల నాగేశ్వరబాబును కులాంతర వివాహం చేసుకుంది. వీరికి యశ్వంత్‌కుమార్, ఆరేళ్ల జ్యోతి ఉన్నారు. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మేనమామ పల్లపు వీరాస్వామి గొరిజవోలుకు తీసుకొచ్చి నివాసం ఏర్పాటు చేశాడు. ఈ నెల 18న తన కుమారుడు యశ్వంత్‌కుమార్ పుట్టినరోజు కావటంతో కేక్ తీసుకొనిరావడానికి బయటకు వెళ్లిన తిరిగి వచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవటంతో అదేరోజు పోలీసులకు లక్ష్మి ఫిర్యాదు చేసింది. లక్ష్మి కుమార్తె జ్యోతి.. వీరాస్వామి యశ్వంత్‌ను కొట్టి చంపి గోతంలో వేసి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని తన తల్లికి చెప్పింది. ఈ విషయాన్ని పోలీసులకు వివరించడంతో.. గాలింపు కొనసాగించి మృతదేహాన్ని కనుగొన్నారు. -
‘భారీ బహిరంగ సభతో ప్రత్తిపాటికి చెక్’
చిలకలూరిపేట(గుంటూరు): అధికార టీడీపీకి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. టీడీపీ వర్గీయులు గ్రామంలోని దళితులు, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న 156 ఎకరాల పట్టా భూమిలో నీరు-చెట్టు పథకం ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సభలో మధు మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నీరు-చెట్టు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలో వందలాది ఎకరాల దళితుల, బలహీనవర్గాల భూములను టీడీపీ నాయకులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. మరోవైపు మంత్రి భార్య ఈ దోపిడికి కీలకంగా నిలుస్తున్నారని, ఆమె సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంత్రి ప్రత్తిపాటి ఆగడాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.