govardhanreddy
-
Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్‌గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు. విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్‌బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) అహ్మద్‌బాబు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, ఎస్బీఐ జీఏం ఓం.నారాయణ్ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్ గోపాల్ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్ఎస్ మూర్తి, ఆప్కాబ్ ఎండీ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్‌దే'
నెల్లూరు : ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి తర్వాత నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్ గొప్పతనాన్ని వివరించారు. నెల్లూరు పట్టణంలో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ.. వైఎస్సార్ మంజూరు చేసన సంగం బ్యారేజీ పనులను ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తిచేయలేదని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విమర్శించారు. బ్రిటీషు ఇంజినీర్ ఆర్థర్ కాటన్ ఏపీని సస్యశ్యామలం చేసిన తర్వాత అటువంటి ఘనత మళ్లీ వైఎస్సార్‌కే దక్కిందని ఆయన సేవల్ని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. -
నిన్నెవరు నియమించారు..!
కడప రూరల్: కడప నియోజకవర్గ తెలుగుదేశంలో విభేదాలు మరోసారి బయటపడ్డారుు. సభ్యత్వ నమోదు సందర్భంగా శుక్రవారం నాయకుల మధ్య వాదన చోటుచేసుకుంది. కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నిన్ను ఎవరు నియమించారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్‌రెడ్డి ఇటీవల కడప అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. అసలు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారుగా ఇక్కడకు ఎందుకు వచ్చావని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక దుర్గాప్రసాద్ మౌనం వహించారు. కడప నగరంలోని సీఎస్ఐ గ్రౌండ్లో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డితోపాటు జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫొటో ఉన్న సభ్యత్వ నమోదు కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కడప అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన దుర్గాప్రసాద్ ఫొటో ఉన్న కరపత్రాలను కూడా ఆవిష్కరించారు. ఈ కరపత్రంలో కడప టీడీపీ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ అని ఉండడాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.గోవర్దన్‌రెడ్డి చూశారు. టీడీపీ ఇన్చార్జిగా ఎవరు నియమించారని దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. పార్టీ కోసం కృషి చేస్తున్నానుగా అనే సమాధానం వచ్చింది. అది సరే.. కడప టీడీపీ ఇన్ఛార్జిగా ఎలా వేసుకుంటావని మరోమారు గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా అనడంతో దుర్గాప్రసాద్ మౌనం వహించారు. తర్వాత అక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి దృష్టికి విషయాన్ని గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లారు. ఆయన కూడా ఆ కరపత్రాన్ని చూసి అవును కదా అని అన్నారు. ఇంతలోనే తేరుకుని ఈ విషయాన్ని జిల్లా కార్యాలయంలో మాట్లాడదాం అంటూ సర్దిచెప్పారు. ఈ సన్నివేశం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. నిజమే.. జిల్లాలో మేం వీక్ : సతీష్‌రెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని, బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సతీష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని టీడీపీలోకి ఆహ్వానించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్, దుర్గాప్రసాద్, పల్లా రాము తదితరులు పాల్గొన్నారు.