Government guarantee
-
రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని వ్యవసాయం, పశుసంవర్థక, ఆహార శుద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చిచెప్పింది. 2015–16 నుంచి 2018–19 మధ్యకాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్‌కు అందజేసింది. ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖకు సూచించింది. చాలా రాష్ట్రాల్లో రైతాంగం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడం శోచనీయమని తప్పుపట్టింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను వ్యవసాయ శాఖ పూర్తిగా ఖర్చు చేయలేకపోతోందని ఆక్షేపించింది. దేశంలో ఆరు ‘ఎయిమ్స్’ల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం పట్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. భోపాల్, భువనేశ్వర్, జో«ద్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేశ్ ఎయిమ్స్‌ల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని వెల్లడించింది. -
బ్యాడ్ బ్యాంక్‌కు సావరిన్ గ్యారంటీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్... ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నవంబర్‌కల్లా లైసెన్సులు బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ మంజూరీకి గత నెల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిర్వహణా తీరు ఇది... ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్ నుంచి మొండిబకాయి (ఎన్పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్ ఉంటాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు... ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్ విలువకు ఎన్ఏఆర్సీఎల్ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది. ఈ బ్యాకప్ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు. 2021–22 బడ్జెట్ చూస్తే... 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటాలు ఇలా.. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్ఏఆర్సీఎల్లో 16 మంది షేర్హోల్డర్లు ఉంటారు. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్ఏఆర్సీఎల్ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా. ‘4ఆర్’ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్), పరిష్కారం (రిజల్యూషన్), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్), సంస్కరణలు (రిఫార్మ్) ‘4ఆర్’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్ బ్యాంక్ ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు. -
బీమా ధీమా కూడా లేదాయె!
తుపానుతో 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం రైతుకు బీమా వర్తించకుండా పోయిన వైనం రుణమాఫీ హామీతో కొత్తగా రుణాలు ఇవ్వని బ్యాంకులు అప్పులిచ్చినట్టైతే బ్యాంకులు అప్పుడే బీమా ప్రీమియం తీసుకునేవి రుణాలు రాకపోవడంతో పునరుద్ధరణ కాని పంటల బీమా దిక్కుతోచని స్థితిలో రైతాంగం హైదరాబాద్: రుణ మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ తుపానులో పంటలు కోల్పోయి న రైతుల పాలిట శాపంగా మారింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకపోవడమే కాకుండా పంటల బీమాను కూడా పునరుద్ధరించుకోలేదు. దీంతో హుదూద్ తుపాను కారణంగా భారీఎత్తున పంటలు నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. హు దూద్ బీభత్సంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. ప్రకృతి బీభత్సాలతో నష్టపోయే రైతుల్ని ఆదుకునేందుకు గ్రామం యూనిట్‌గా వర్షాధారిత పం టల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంట వేసింది మొదలు కోసిన తర్వాత పంట కల్లాల్లో ఉన్నప్పుడూ 14 రోజుల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. మామూలుగా రైతు లు ఖరీఫ్ సీజన్లో (ఏప్రిల్ నుంచి జూలై మధ్య) బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అప్పు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రైతులు వేసే పంటలకు అనుగుణంగా బీమా ప్రీమియా న్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తుంటాయి. అయితే రుణ మాఫీ హామీ నేపథ్యంలో ఏ రైతుకూ బ్యాంకులు ఇప్పటివరకు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని స్పష్టం చేయడంతో పం టల బీమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ పథకం గడువు గత నెలాఖరుతో ముగిసింది. గడువు ముగిసిన రెండు వారాల్లోపే తుపాను వచ్చి రైతులకు అపార నష్టం మిగిల్చి వెళ్లింది. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదారతపై ఆధారపడాల్సిందే తప్ప.. ఓ హక్కుగా బీమాను పొందే వీలును కోల్పోయారు. ఈనెల 22 తర్వా త తొలి విడతగా బ్యాంకులకు చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలయ్యే లోపే నష్టం జరిగింది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, మిరప, వేరుశన గ, జీడిమామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లిం ది.రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారే గానీ వ్యవసాయ బీమా గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసా య బీమా అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సం స్థలే చూస్తుంటాయి. ప్రభుత్వం నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప నిబంధనలు మార్చడానికి బీ మా సంస్థలు అంగీకరించవు. నీలం, పైలిన్ తుపాన్ల నష్టపరిహారమే ఇప్పటివరకు అందలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీమా వస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీకే నిధులకు కటకటలాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు పెట్టుబడి రాయితీని ప్రకటించారు. అరుుతే ఇది నిర్దిష్ట గడువులోపు అందితే తప్ప రైతులు కోలుకునే స్థితి లేదు. పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని, పరిహారం ఇవ్వదల్చుకుంటే ఎప్పటిలోగా ఇస్తారో ప్రకటించాలని అంటున్నారు. బీమా ఉంటే ఎకరాకు రూ. 23 వేల వరకు వచ్చేవి.. ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పడం వల్ల 90 శాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో రైతులందరూ ఖరీఫ్‌లో బీమా అర్హత కోల్పోయారు. ప్రభుత్వం లేదా రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ జరిగి ఉంటే తుపాను ప్రభావం వల్ల పంట పోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.23 వేల వరకు బీమా అందేది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఆర్బీఐ నిబంధనల మే రకు తీసుకున్న రుణ మొత్తం ఒకేసారి చెల్లిస్తే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏడాదికి 20శాతం మే ర చెల్లిస్తామంటే రైతులకు తిరిగి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వాటిని రాని బకాయిలు గా చూపి రైతులకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. పంట రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. - రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే.. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. తుపాను కారణంగా చెరకు, అరటి ఇతర పంటలన్నీ నేల కొరిగాయి. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం సంభవించింది. తిరిగి పంట వేయాలన్నా ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంక ర్లు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రభుత్వం, బ్యాంకర్లు స్పం దించకుంటే మున్ముందు పంటలు వేసుకోలేం. - సత్యనారాయణ, రైతు,సిరివాడ, తూ.గో.జిల్లా ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలి. దెబ్బతిన్న పంట పొలాలను సందర్శిస్తున్నా సహాయంపై ఇప్పటివరకు ఎవరూ మా ట్లాడటంలేదు. సర్వే చేయిస్తామని చెబుతున్నా ఎక్కడా చేయించలేదు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి. - కె.రామచంద్రరావు,సిరివాడ,తూ.గో.జిల్లా రైతులకు రెండు విధాలా నష్టం రైతులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించని పరిస్థితి ఏర్పడింది. తుపానుతో పంట కోల్పోయిన రైతులు రుణమాఫీ అందక, బీమా రాక అప్పుల ఊబిలో మరింత మునిగిపోయూరు. - దడాల సుబ్బారావు, కౌలు రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా