‘గ్రాండ్ ట్రంక్ రోడ్’
ఇదో మెనూ..! అలాగని రోడ్లకు సంబంధించిందో... వాటి వెరైటీల లిస్టో కాదు. పసందైన వంటకాల విందు ఇది. కాబూల్ నుంచి చిట్టగాంగ్ వరకు ఉన్న జీటీ రోడ్డు వెంట ధాబాల్లో వడ్డించే ఫుడ్ వెరైటీస్‌తో బంజారాహిల్స్ బార్బిక్యూ నేషన్ వేడివేడిగా అందిస్తోంది. అందుకు తగ్గట్టుగా... కస్టవుర్లకు రోడ్ సైడ్ కూర్చుని తిన్న ఫీలింగ్ కల్పిస్తోంది. పంజాబీ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, బెంగాలీ రెసిపీలతో బుధవారం ‘గ్రాండ్ ట్రంక్ రోడ్’ సెలబ్రేషన్స్ ప్రారంభించింది. జింగా పాస్తా, వులాయ్ కర్రీ, అఫ్ఘనీ పులావ్ తదితర 40 రుచులను అందిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని బార్బిక్యూ రెస్టారెంట్లో కూడా ఈ నెల 17 వరకు ఈ ‘టేస్ట్’ చూడవచ్చు.
- సాక్షి, సిటీ ప్లస్