హంసకు హంగులు
ఇంద్రకీలాద్రి: విజయదశమి రోజున శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కృష్ణానదిలో విహరించేందుకు హంస వాహనం సిద్ధమవుతోంది. దశమికి ఇక మూడు రోజులే గడువు మిగిలి ఉండటంతో హంస వాహన నిర్మాణం వేగంగా సాగుతోంది. రంగులు, ఇతర హంగులతో ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం నాటికి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.