హాత్వే రాజశేఖర్‌కు పితృ వియోగం
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌వో అధ్యక్షుడు హాత్వే రాజశేఖర్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి రంగనాయకులు (80) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రంగనాయకులు కార్మిక నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రంగనాయకులు అంత్యక్రియలు విశాఖలో జరగనున్నట్లు సమాచారం.