చెమటలా కారుతున్న రక్తం
నల్లగొండ టౌన్: కోట్ల మందిలో ఒకరికి యుక్త వయస్సులో వచ్చే జబ్బు (హెమటైడ్రోసిస్)గా చెబుతున్న ఓ వ్యాధిని నయం చేసిన ఘనత నల్లగొండ జిల్లా మెడికల్ కళాశాల జనరల్ ఆస్పత్రికి దక్కింది. మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడేనికి చెందిన వి.వెంకట్‌రెడ్డి కుమారుడు శంకర్‌రెడ్డి (11)కి మనిషికి చెమటకారినట్టు శరీర భాగాల నుంచి రక్తం కారేది. 2017 ఆగస్టు నుంచి ఆ విద్యార్థి శరీరంలోని ముఖం, చెంపలు, చేతులు, కాళ్ల మీద నుంచి రక్తం కారడం మొదలైంది. నిత్యం పది నుంచి పదిహేనుసార్లు ఇలా జరిగే ది. వెంకట్‌రెడ్డి తన కుమారుడిని నల్లగొండ, హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెండేళ్ల పాటు తిప్పారు. రూ. లక్షలు ఖర్చు చేసినా.. వైద్యులు నయం చేయలేకపోయారు.
వ్యాధి నిర్ధారణ ఇలా..
2018 డిసెంబర్లో తన గ్రామానికే చెందిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సురేశ్‌రెడ్డికి తన కుమారుడి వ్యాధిని గురించి వెంకట్‌రెడ్డి వివరించారు. శంకర్‌రెడ్డికి ఆస్పత్రిలో పలురకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు గత రి పోర్టులను పరిశీలించారు. చివరకు ఇంటర్నెట్లో వైద్యరంగానికి చెందిన లిటరసీలో సెర్చ్ చేయడంతో వ్యాధి గురించి తెలిసింది.
విద్యార్థి హెమటైడ్రోసిస్‌తో బాధపడుతున్నట్లు సురేశ్‌రెడ్డి నిర్ధారణకు వచ్చారు. జనరల్ ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికి త్స ప్రారంభించారు. వ్యాధి నుంచి వారం రోజుల్లో విద్యార్థి కోలుకుంటున్నట్లు గుర్తించి అవుట్ పేషంట్‌గా చికిత్స అందించారు. నాలుగు నెలల తర్వాత శంకర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.