హెపటైటిస్, హెర్పిస్‌లకు మెరుగైన వైద్యచికిత్స
కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో లక్షణాలేవీ కనిపించడం లేదని నిర్లక్ష్యంగా ఉంటే అది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. ఈ వైరస్‌లకు హోమియోలో మెరుగైన చికిత్స ఉందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. రవికిరణ్.
హెపటైటిస్ అనగానే మామూలుగా హెపటైటిస్ బి గుర్తుకు వస్తుంది. కానీ హెపటైటిస్ సి,ఏ, ఇ అనే చాలా రకాలూ ఉన్నాయి. హెపటైటిస్‌తో కాలేయం పనితీరు మెల్లగా మందగించి ప్రాణాంతకంగామారుతుంది. కాలేయ కేన్సర్‌కూ దారి తీయవచ్చు. హెపటైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వ్యాధి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్స ఇతర వైద్యవిధానాలలో లేదు. కానీ హోమియో వైద్యంలో అద్భుతమైన చికిత్స ఉంది.
ఇవీ కారణాలు
సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం. స్వలింగ సంపర్కం. అపరిచితుల నుంచి రక్తం స్వీకరించడం. కలుషితమైన సిరంజులను వాడటం. తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తిచెందడం. ప్రధానంగా ఈ మూడు మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది.
వ్యాధి లక్షణాలు
ఇది పేషెంట్ తాలూకు రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తుంది. ఆకలి లేకపోవడం, వికారం, ఒంటినొప్పులు, పసుపు రంగులో మూత్రం వంటి లక్షణాల తర్వాత మెల్లిగా పచ్చకామెర్లు మొదలవుతాయి. దీంతోపాటుగా చర్మంపైన దద్దుర్లు కనిపిస్తాయి. చాలామందిలో ఇవి తర్వాత కనుమరుగయిపోతాయి. కొన్ని కేసులలో కాలేయం పనిచేయటం ఆగిపోయి మరణం సంభవిస్తుంది. దీనినే ఫల్మినంట్ హెపటిక్ ఫెయిల్యూర్ అంటారు. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ బి వ్యాధి చాలా ఆలస్యంగా... అంటే కొన్నేళ్ల తర్వాత బయటపడవచ్చు. దీన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్లేదా క్రానిక్ హెపటైటిస్ అంటారు. వీరిలో కామెర్ల వ్యాధి తగ్గకుండా అలాగే ఉంటుంది. వాంతులు, ఒళ్ళంతా దురదలు, విరేచనాలు, కడుపుబ్బరం, పొట్టలో నొప్పి, రక్తనాళాల వాపు, కిడ్నీ సమస్యలు, ప్లేట్లెట్స్ తగ్గడం, తలనొప్పి, రక్తహీనత, రక్తకణాల సంఖ్య పడిపోవడం జరుగుతుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
హెపటైటిస్ బి, సి లను గుర్తించడానికిహెచ్బిఎస్ఎజి; సి గురించి హెచ్సివి యాంటీబాడీ ఎంజైమ్ ఇమ్యూనో అస్సే; హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్ పీసీఆర్ టెస్ట్ వంటివి వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి. ఎల్ఎఫ్టీ, ఈఎస్సార్ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి.
హోమియో చికిత్స
హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయాన్నే తమ ఆవాసంగా చేసుకోడానికి కారణం... అవి వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. దీన్నే రిప్లికేషన్ అంటారు. ఈ రిప్లికేషన్‌ను హోమియో మందుల ద్వారా అడ్డుకోవచ్చును. అంతేగాక రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి వైరస్‌ను పెరగకుండా చేయవచ్చు. లైకోపోడియం, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని సమర్థంగా తగ్గిస్తాయి.
నిర్లక్ష్యం చేస్తే...
హెపటైటిస్ వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు, స్ల్పీన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
హెర్పిస్ సింప్లెక్స్
ఒక గుండు సూది మొనమీద కోటి వైరస్లు ఇమిడిపోయేంత సూక్ష్మమెన ఈ వైరస్ రెండు రకాలుగా ఉంటుంది.
హెచ్ఎస్వి 1: ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటిపొక్కులలాగా వస్తాయి. ఇది తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. తరచు వచ్చిపోతుంటుంది.
హెచ్ఎస్వి 2: జననావయవాల దగ్గర బయటపడే దీన్ని జెనిటల్ హెర్పిస్ అని అంటారు. ఇది నిత్యం వేధించే లైంగిక సమస్య.
హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు, స్త్రీల నుంచి పురుషులకు లైంగికంగా కలయిక సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వెన్నెముక చివరిభాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చేరి అక్కడ నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణస్థితిలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా అవసరమైనపుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది.
గుర్తుపట్టడం ఎలా?
తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఒళ్లునొప్పులు, గజ్జలలో, చంకలలో గడ్డలు కట్టినట్లుగా ఉంటుంది. తరువాత క్రమంగా జననాంగాల వద్ద చిన్న చిన్న నీటిపొక్కులు కనిపించి, రెండు మూడు రోజులలో పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ దశలోనే రోగికి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. తొలిసారి లక్షణాలు కనిపించినపుడు సరియైన చికిత్స తీసుకుంటే ప్రారంభదశలోనే తగ్గిపోతుంది. కానీ చాలామందిలో వైరస్ ఉండిపోవడం వల్ల నిదానంగా ఉంటూ తిరిగి బయటపడుతూ ఉంటుంది. దీన్ని హెర్పిస్ రికరెంట్ అటాక్ అని అంటారు.
నిర్ధారణ ఎలా?
అపరిచిత వ్యక్తులతో లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలా పుండ్లు కనిపిస్తాయి. కొన్నిరోజుల తరువాత మానిపోయి తిరిగి వస్తుంటాయి. దీన్ని బట్టి హెర్పిస్ని గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్ట్, హెచ్ఎస్వి. 1, 2 ఐజీజీ, ఐజీఎమ్ పరీక్షలు ఉపయోగపడతాయి. పుండ్ల దగ్గర ఉండే స్రావాలను సేకరించి చేసే కల్చర్ టెస్ట్, డీఎన్ఏ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొదలైనవి వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి.
కాంప్లికేషన్స్
హెర్పిస్ ఎక్కువగా స్త్రీలను బాధిస్తుంది. గర్భిణుల్లో మొదటినెలలో హెర్పిస్ వస్తే గర్భస్రావానికి అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో హెర్పిస్ ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నియోనాటల్ హెర్పిస్ అంటారు. శరీరంలో హెర్పిస్ ఉంటే చర్మం మీద దద్దుర్లు. అలర్జీలాంటి సమస్యలు; వెన్నెముకలోని నాడీమండలానికి హెర్పిస్ వస్తే అంగస్తంభన సమస్యలు; కొందరిలో నాడీమండలానికి హెర్పిస్ వస్తే మెదడులో మెనింజైటిస్ రావచ్చు.
హోమియో చికిత్స
హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రోగనివారణకు అవకాశం ఏర్పడుతుంది. హెర్పిస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు శృంగారానికి దూరంగా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. హెర్పిస్ ఉన్నవారు కండోమ్ ఉపయోగిస్తే మంచిది. అనుభజ్ఞులైన హోమియో వైద్యుని దగ్గర చికిత్స తీసుకుంటే హెర్పిస్ వ్యాధిని సమూలంగా తరిమేయవచ్చు.
డాక్టర్ రవికిరణ్, ఎం.డి.
ప్రముఖ హోమియో వైద్యనిపుణులు
మాస్టర్స్ హోమియోపతి,
అమీర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్,
హైదరాబాద్, విజయవాడ
ph: 7842 108 108 / 7569 108 108