లేసు పార్కు కట్టారు.. శిక్షణ మరిచారు
కందరవల్లి (ఆచంట), న్యూస్‌లైన్ : నరసాపురం డివిజన్లోని అధిక శాతం మహిళలకు లేసు అల్లికలే ప్రధాన ఆదాయ వనరు. ఈ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఇంటిపనులు చక్కబెట్టుకున్నాక.. ఇంటిపట్టునే ఉం టూ లేసులు అల్లడం ద్వారా కొద్దోగొప్పో ఆదాయం పొందుతున్నారు. అరుుతే, వారి శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. లేసు అల్లికలు అంత సులువైన పనికాదు. ఎంత కష్టపడినా ఒక్కొ క్క మహిళకు లభిస్తున్న రోజువారీ కనీస ఆదాయం రూ.20 నుంచి రూ.30లోపే ఉంటోంది.
ఇలాంటి మహిళల సంక్షేమం, సాధికారతే లక్ష్యమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మీనమేషా లు లెక్కిస్తోంది. మహిళలకు అల్లికల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, శ్రమకు తగిన ఫలితం దక్కేందుకు వీలుగా డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు అలంకృతి మినీ లేసు పార్కుల పేరిట భవనా లు నిర్మించారు. ఆధునిక లేసు కుట్టు యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. అయితే, ఇవన్నీ అలంకారప్రాయంగా మారిపోయూరుు. మహిళలకు శిక్షణ ఇవ్వడం.. లేసులకు మార్కెటింగ్, గిట్టుబాటు కూలీ లభించేలా చేయడంలో విఫలమయ్యూరు.
రూ.కోట్లు కేటాయించినా...
నరసాపురం డివిజన్లో గల 14 మండలాల్లో 55చోట్ల అలంకృతి మినీ లేసుపార్కులు నిర్మించాలని నిర్ణరుుంచారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇప్పటివరకూ 35చోట్ల భవనాలను నిర్మించారు. 20చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 15 భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున, మిగిలిన వాటికి రూ.20 లక్షల చొప్పున కేటాయించారు. వీటి నిర్వహణ, మహిళలకు శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వంటి పనులను డీఆర్డీఏ పర్యవేక్షిస్తోంది. లేసుపార్కుల నిర్మాణానికి కోట్లాది రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం కేటారుుంచింది. ఆధునిక కుట్టు యంత్రాలను సైతం సమకూర్చింది. అయితే, వీటిలో ఎక్కడా శిక్షణ మొదలు కాలేదు.
రోజంతా కష్టపడినా...
చిన్నప్పటి నుంచీ లేసులు అల్లుతున్నాను. రోజంతా క ష్టపడినా 30 రూపాయలైనా రాలేదు. మా ఊళ్లో లేసుపార్కు కడుతున్నారంటే మహిళలంతా ఎంతో ఆనందించాం. కొత్త అల్లికలు నేర్చుకోవచ్చనుకున్నాను. ఇందులో మెషిన్లు పెట్టి మహిళలకు ఉపాధితోపాటు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. బిల్డింగ్ కట్టారే తప్ప ఉపయోగం లేదు. దీనివల్ల మాకు పైసా ఉపయోగం కూడా లేదు. ప్రభుత్వం స్పందించి లేసు భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి.
- కె.నాగమణి, లేసు అల్లే మహిళ, కందరవల్లి