horlicks factory
-
సినీఫక్కీలో చోరీ
తూర్పుగోదావరి, ధవళేశ్వరం: మహిళను నిర్బంధించి చోరీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని ఆగంతకులు. ధవళేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అగ్రహారం మూడో వీధిలో హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మేఘం లీలాకృష్ణ కుటుంబంతో సహ నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో లీలాకృష్ణ భార్య జయదుర్గ బాత్రూంకి వెళ్లేందుకు ముందువైపు తలుపులు తీశారు. ఇంతలో ఒక గుర్తు తెలియని వ్యక్తి జయదుర్గ అరవకుండా పట్టుకోగా మరో వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి బెదిరించాడు. జయదుర్గను బలవంతంగా బెడ్రూంలోకి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి చీరతో కట్టేశారు. ఈ సమయంలో జయదుర్గకు ఇంజక్షన్ ఇచ్చారు. బీరువా తాళం ఎక్కడ ఉందని అరిస్తే చంపేస్తామని బెదిరించారు. మూడో ఆగంతకుడు బీరువా తాళం తీసుకొని దానిలోని రూ.2.14లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఇంజక్షన్ ఇవ్వడంతో జయదుర్గ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. డ్యూటీ నుంచి వచ్చిన భర్త లీలాకృష్ణ జయదుర్గ అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె ధవళేశ్వరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. జయదుర్గ ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ వైవీ రమణకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీస్ జాగిలాలను రప్పించారు. అవి ఘటనా స్థలం నుంచి అగ్రహారం ప్రధాన రోడ్డు వరకు వెళ్లాయి. చుట్టూ నివాస గృహాలు ఉండే ప్రాంతంలో ఈ తరహా చోరీ జరగడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ధవళేశ్వరం సీఐ ఈ.బాలశౌరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హార్లిక్స్ రేసులో కోకకోలా
న్యూఢిల్లీ: మాల్ట్ ఆధారిత హెల్త్ డ్రింక్ హార్లిక్స్ కొనుగోలు రేసులో తాజాగా కోక–కోలా కూడా చేరింది. గ్లాక్సో స్మిత్‌లైన్ (జీఎస్కే) కంపెనీ హార్లిక్స్ బ్రాండ్‌ను భారత్‌లో విక్రయానికి పెట్టింది. ఈ 145 ఏళ్ల బ్రాండ్‌ను 390 కోట్ల డాలర్లకు (300 కోట్ల పౌండ్లు)విక్రయించాలని జీఎస్కే యోచిస్తోందని ఇంగ్లాండ్‌కు చెందిన సండే టెలిగ్రాఫ్ వెల్లడించింది. హార్లిక్స్ బ్రాండ్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజ సంస్థలు–నెస్లే, క్రాఫ్ట్ హీంజ్ తదితర సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కోక–కోలా కూడా ఈ రేసులో చేరిందని సమాచారం. కాగా ఊహాజనిత వార్తలపై వ్యాఖ్యానించకూడదనేది తమ విధానమని కోకకోలా కంపెనీ పేర్కొంది. అమెరికాకు చెందిన కోక–కోలా కంపెనీ ఇటీవలనే ఇంగ్లాండ్‌కు చెందిన కోస్టా కాఫీ చెయిన్‌ను 500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కాగా హార్లిక్స్ కోక–కోలా పరమైతే కోకకోలా కంపెనీకి ఇది భారత్‌లో రెండో అతి పెద్ద కొనుగోలు అవుతుంది. గతంలో కోకకోలా కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. హార్లిక్స్ విక్రయం ఎందుకంటే... నోవార్టిస్ కంపెనీకి చెందిన కన్సూమర్ హెల్త్‌కేర్ వ్యాపారంలో 36.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీఎస్కే నిర్ణయించింది. ఈ వాటాను 920 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేయనున్నది. ఈ కొనుగోలుకు కావలసిన నగదును సమకూర్చుకోవడం కోసం జీఎస్కే కంపెనీ హార్లిక్స్, ఇతర బ్రాండ్లను విక్రయిస్తోంది. -
హార్లిక్స్ ఫ్యాక్టరీలో కార్మికుల ధర్నా
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీలోని కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ధర్నాకు దిగారు. సోమవారం రాత్రి నుంచి ఫ్యాక్టరీ ఆవరణలో నిరాహారదీక్ష చేపడుతున్నారు. దీంతో యూనియన్ అధ్యక్షుడు జయబాబు అస్వస్థతకు గురయ్యాడు. అయిన యాజమాన్యం వైఖరిలో ఏలాంటి మార్పు రాకపోవడంతో మంగళవారం ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు.