ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇదొక పరాకాష్ట. చూడగానే గుండెలు ఆగిపోయేలా చేసేంత భయంకరమైన దృశ్యం.. ఆఖరికి కిల్లర్ సినిమాల్లో కూడా కనిపించని దృశ్యాన్ని ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉన్నాడని అతడిని బంధించి, బాగా కొట్టి, చేతులను వెనక్కి కట్టి, కాళ్లను కూడా తాడుతో కట్టేసి ముఖానికి ముసుగు వేసి ఓ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి కిందపడేసి చంపేశారు. ఐఎస్ 'లా' ప్రకారం ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉండటం, ఆ విధానానికి మద్దతు తెలపడం నేరం.
ఈ కారణంతోనే ఆ వ్యక్తిని బంధించి అతడికి మరణ శిక్షను అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎలాంటి శిక్ష అమలుచేస్తున్నారా అని గుంపులుగుంపులుగా జనం ఆ భవనం వైపు చూస్తుండగా వారి పక్కనే ఉగ్రవాదులు తుపాకులతో ఉండగా ముసుగేసి తాళ్లతో బంధించి ఉన్న ఆ వ్యక్తిని నేరుగా కిందపడేశారు. దీంతో అతడు తలపగిలి చనిపోయాడు. ఆ వ్యక్తి ఆ భవనంపై నుంచి కిందపడిపోతున్నప్పటి నుంచి నేలను తాకి చనిపోయేంతవరకు ఫొటోల్లో బంధించి వాటిని ఉగ్రవాదులు విడుదల చేశారు.