వరంగల్లో భారీగా నగదు స్వాధీనం
మట్టెవాడ : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి నుంచి బుధవారం రూ.3.5 లక్షల విలువైన పాత నోట్లను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి కృష్ణా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నగదు తీసుకొచ్చిన వ్యక్తి వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన సంగా రవి(44)గా గుర్తించారు.