చైనాలోని హన్చిన్ నగరంలో భూకంపం
చైనాలోని జిలిన్ ప్రావెన్స్లో ఈశాన్య ప్రాంతమైన హన్చున్ నగరంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే భూకంపంలో ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టంకాని, ప్రాణ నష్టం కాని సంభవించలేదని తెలిపారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.3గా నమోదు అయిందని వివరించారు. భూకంపం సంభవించిన సమయంలో నగర ప్రజల నిద్రలో ఉన్నారని చెప్పారు. చైనాలో తరుచుగా భూకంపం వచ్చే ప్రాంతాల్లో హన్చిన్ ఒకటని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది.