Husbands death
-
నువులేక నేను ఎందుకని..
•నిన్న విద్యుదాఘాతంతో భర్త మృతి •నేడు ఆత్మహత్యకు యత్నించిన భార్య •ఆరోగ్య పరిస్థితి విషమం •ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం ముత్తారం : ఏడడుగుల బంధంతో ఏకమై.. నిండు నూరేళ్లపాటు కష్టసుఖాల్లో పాలుపంచుకునే భర్త విద్యుదాఘాతంతో మృతి చెందడంతో తట్టుకోలేని భార్య తానూ తనువు చాలించాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు పురుగులమందు తాగి అపస్మారక స్థితికి వెళ్లింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీస్కుల సారక్క, సమ్మయ్య దంపతులు. వీరి కూతురు సరిత(24)ను ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన సమ్మయ్యకు ఇచ్చి తొమ్మిది నెలల క్రితం వివాహం జరిపించారు. కొన్నినెలలకే ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది. నీటి అవసరాలకు వినియోగించే విద్యుత్ మోటారు మరమ్మతు చేస్తూ సమ్మయ్య బుధవారం విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యూడు. భర్త తనను విడిచి వెళ్లడాన్ని జీర్ణించుకోని సరిత.. తీవ్రమనస్తాపం చెందింది. గురువారం వేకువజామున కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నాక ఇంట్లోని క్రిమిసంహారకమందు తాగింది. మెలకు వచ్చిన కుటుంబ సభ్యులు గమనించేలోగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేరుుస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్: భర్త నెల క్రితం చనిపోయాడు. భర్త లేని ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలల పసిపాపను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. తానూరుకు చెందిన మంజు (22)కు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్‌కు చెందిన యువకునితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ 31న మంజు భర్త మృతి చెందాడు. దాంతో మంజు శిశువుతో కలసి వచ్చి తానూరులోని తల్లీదండ్రులు లాల, భారత్‌బాయి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. (తానూర్) -
భర్త మృతిపై భార్య అనుమానం
కశింకోట,న్యూస్‌లైన్: భర్త మృతిపై అనుమానాలున్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవ దహనాన్ని అర్థంతరంగా నిలిపి వేశారు. శవానికి పంచనామా జరిపి మళ్లీ దహన సంస్కారాలు చేశారు. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70)కు, అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె మాణిక్యంతో 40 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 30 ఏళ్ల కిందట సత్యవేణి అనే ఏైకైక కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో నూకినాయుడుతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో కుమార్తెనపు పెంచి, పెళ్లి చేసి అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకొని నూకినాయుడు జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న సుమారు ఎకరం భూమిని కుమార్తె పేరున రాశారు. ఈ విషయం తెలియడంతో మాణిక్యం కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. ఈ విషయం అదే గ్రామంలో ఉంటున్న మాణిక్యంకు తెలియజేయలేదు. శవాన్ని దహనానికి తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకొంది. దీంతో ఇది సంప్రదాయం కాదంటూ అల్లుడు, బంధువులు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. దీంతో శవాన్ని తనకు చూపించలేదని, తనపై చేయి చేసుకున్నారని, భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ విజయకుమార్, తహశీల్దార్ కె.రమామణిల ఆధ్వర్యంలో పోలీసులు శ్మశానానికి చేరుకొని కాలుతున్న శవాన్ని నీటితో అర్పించి, పోస్టుమార్టం జరిపించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామా అనంతరం నూకునాయుడు శవాన్ని దహనం చేశారు.