ఐబాల్ కొత్త స్మార్ట్ఫోన్
ముంబై: ఐబాల్ కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్, అండి 5.5ఎన్2ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ హ్యాండ్సెట్ ధర రూ.13,499. ఈ ఫోన్ లో 1.2 గిగా హెట్స్ క్వాడ్ కోర్ కోర్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ, 12 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.
లావా ఐరిస్ 405 ప్లస్ స్మార్ట్ఫోన్
లావా కంపెనీ ఐరిస్ 405 ప్లస్ పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.6,999. లావా ఐరిస్ 405 ఫోన్కు కొనసాగింపుగా వచ్చిన ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ ఓఎస్, 1.3 గిగా హెట్స్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల డిస్ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకూ ఎక్స్పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ప్రీమియం స్మార్ట్ఫోన్ అనుభూతిని వినియోగదారులకు అందుబాటు ధరలో అందించడం లక్ష్యంగా ఈ ఫోన్ను తెచ్చామని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు.