ఐదుగురు గుంటూరు పోలీసులపై వేటు
గుంటూరు: గుంటూరు నగర పరిధిలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. విధినిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండైన వారిలో సీఐ శేషయ్య, ఎస్ కృష్ణయ్య, ఏఎస్ఐ నాయక్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.