illegal gold
-
అక్రమ బంగారం పట్టివేత
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ హైదరాబాద్: అక్రమంగా 4.5 కేజీల బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ జీఆర్పీ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు అమృత్‌సర్‌కు చెందిన ఖన్నా రాజేశ్, జగ్మోహన్సింగ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాజేశ్, సింగ్ కదలికలపై అనుమానం వచ్చిన జీఆర్పీ పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా సుమారు 4.532 కేజీల బంగారు ఆభరణాలు కనిపించాయి. బంగారానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి బిల్లులు లభించకపోవటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం
ఖాట్మాండ్: స్కూటర్లో భారీగా బంగారపు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శనివారం ఖాట్మాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖాట్మాండ్ పరిసర ప్రాంతాల్లో బంగారం అక్రమ రవాణ అధికమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్కూటర్ డిక్కీలో భారీగా బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు.