ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ఐయామ్
ఏ బిచ్-మడోనా
నిడివి : 4 ని. 03 సె.
హిట్స్ : 58,97,844
‘రెబెల్ హార్ట్’ (2015)ఆల్బమ్‌లో మెడొన్నా పాడిన ‘బిచ్ ఐయామ్ మడోనా’ పాట ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడీ పాట రెబెల్ హార్ట్ ఆల్బమ్ నుంచి సింగిల్‌గా విడుదలైంది. తన తాజా ఆల్బమ్ తయారుకావడానికి ముందు ‘‘ఉర్రూతలూగించే సంగీతంతో ఈసారి ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నా’’ అని ప్రకటించారు మడోనా. అది నిజమైంది. ‘ఐయామ్ ఏ బిచ్’ కలర్‌ఫుల్ వీడియో ఈవారం యూట్యూట్ హిట్లలో అగ్రభాగాన ఉంది.
బ్రదర్స్
నిడివి : 2 ని. 55 సె.
హిట్స్ : 50,22,580
హాలీవుడ్ సినిమా ‘వారియర్’కు రీమేక్‌గా వస్తోంది ‘బ్రదర్స్’. వారియర్లో టామ్ హార్డీ, జోయెల్ ఎడ్గెర్టన్ పోషించిన పాత్రలను అక్షయ్ కుమార్, సిద్ధార్థమల్హోత్రాలు పోషించారు. ‘మహాభారతంలోలాగే ఇది సోదరుల మధ్య జరిగే యుద్ధం’ అని ట్రైలర్ చెబుతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు, సినీ ప్రముఖుల నుంచి కూడా దీనికి ‘పవర్ఫుల్ ట్రైలర్’ అనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది.
కుంగ్‌ఫూ పాండా 3
నిడివి : 2 ని. 06 సె.
హిట్స్ : 21,90,614
‘పో’ ఈజ్ బ్యాక్! డ్రీమ్ వర్క్ యానిమేషన్ రిలీజ్ చేసిన ‘కుంగ్ఫు పాండా 3’ ట్రయిలర్ పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తోంది. ‘పో’ అనే పేరుగల పాండా ఈ చిత్రంలో మరిన్ని సాహసాలు అద్భుతాలు చేయబోతోంది. అంతేకాదు, తన తండ్రిని తిరిగి కలుసుకుంటుంది. మెయ్ మెయ్ అనే ఆడ పాండాతో ప్రేమలో పడుతుంది. ఈ చిత్రం 2016 జనవరి 29న రిలీజ్ అవుతోంది. అంతవరకు ఆగలేని వారికి పార్ట్ 1 పార్ట్ 2 ఎలాగూ ఉన్నాయిగా!
కట్టి బట్టి
నిడివి : 2 ని. 58 సె.
హిట్స్ : 21,46,284
కంగనా రనౌత్, ఇమ్రాన్‌ఖాన్‌ల ‘కట్టి బట్టి’ ఫక్తు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఈ భిన్నధృవాలు పరస్పరం ప్రేమించుకొని ఐదేళ్లు ‘లివ్-ఇన్ రిలేషన్షిప్’లో ఉంటాయి. ఊహించని ఘటనలతో సాగే ఈ కథ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కంగనాకు ఈ సినిమా మరో వరుస హిట్ అందిస్తుందో లేదో? అనేది వేచి చూడాలి. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ట్రైలర్ మాత్రం ఇప్పటికే నవ్వులు పండిస్తోంది.
భజ్రంగి భాయ్‌జాన్
నిడివి : 2 ని. 43 సె.
హిట్స్ : 9,23,840
గత గురువారం విడుదలైన భజ్రంగి భాయ్‌జాన్ ట్రెయిలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నాలుగు రోజుల్లోనే దగ్గర దగ్గర పది లక్షల హిట్లు వచ్చేశాయి! ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కరీనా కపూర్ నటిస్తున్నారు. హిందూ అబ్బాయికి, ముస్లిం అమ్మాయికి మధ్య నడిచే ఈ ప్రేమ కథా చిత్రంలో 49 ఏళ్ల సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తనకే ప్రత్యేకమైన డాన్సులు, ఫైట్లతో ఆకట్టుకోబోతున్నాడని ఈ ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.
ఇగ్గీ అసేలియా
కార్‌పూల్ కారావ్కే
నిడివి : 8 ని. 2 సె.
హిట్స్ : 3,42,536
ఆస్ట్రేలియన్ పాప్ సింగర్ ఇగ్గీ అసేలియా, బ్రిటిష్ టెలివిజన్ హోస్ట్ జేమ్ కార్డెన్ కలిసి కారులో పాటలు పాడుకుంటూ షికార్లు కొట్టే వీడియో ఇది. ఇగ్గీకి ఈ మధ్యే నిశ్చితార్థం జరిగింది. ఆ టాపిక్‌కి సంబంధించిన సంభాషణలు, మధ్యలో వెడ్డింగ్ డ్రెస్ కొనేందుకు ఇగ్గీ ఒక షాపుకు వెళ్లడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కారులో ప్రయాణిస్తున్నంత సేపూ కారావ్కే నేపథ్య సంగీతానికి వీళ్లిద్దరూ గొంతు కలుపుతుంటారు.