ఘనంగా నిమజ్జనం
శాంతినగర్: వినాయక చవితి సందర్బంగా ప్రతిష్టించిన గణేషుని నిమజ్జన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. శాంతినగర్, రాజోలి గ్రామాల్లో పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథుల మండపాల వద్ద రాజోలి అడేవేశ్వరస్వామి, కప్పలబావి గణేషుని వద్ద గురువారం మధ్యాహ్నం లడ్డూల వేలంపాటలు నిర్వహించారు. అనంతరం వాహనాల్లో విగ్రహాలను ఉంచి ఊరూవాడా ఊరేగించారు. ఈసందర్బంగా భక్తులు, నిర్వాహకులు టపాసులు కాల్చుతు, రంగులు చల్లుకుంటూ డప్పుల మోతల మధ్య చిందులువేశారు. అనంతరం సమీపంలోని తుంగభద్రనదిలో నిమజ్జనంగావించారు. దీంతో గణేషుని ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
రూ.21 వేలు పలికిన లడ్డూ
వినాయక చవితి సందర్బంగా గణపతి చేతిలోని లడ్డూలు వేలంపాటలు నిర్వహించారు. రాజోలి అడివేశ్వరస్వామి ఆలయం ముందు ప్రతిష్టించిన వినాయకుని చేతిలోని లడ్డూను గ్రామానికి చెందిన బోయ మహేంద్రబాబు రూ.21 వేలకు వేలంపాటల్లో కైవసం చేసుకున్నాడు.