బడి పేరు పెట్టుకున్న వ్యాధి ‘స్కూల్ సోర్స్’!
మెడి క్షనరీ
ఆ వ్యాధి పేరు ‘స్కూల్ సోర్స్’. అంటే బడికి వెళ్తే వచ్చే పుండ్లు అని అర్థం. కానీ ఇవి బడికి వెళ్లడం వల్ల రావు. స్కూల్కు వెళ్లే వయసు పిల్లల్లో ఎక్కువగా వచ్చే చర్మవ్యాధి కాబట్టి దీనికి ఆ పేరు. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీన్ని ఇంగ్లిష్లో ‘ఇంపెటిగో’ అంటారు. ఇది స్టెఫలోకోకస్ ఆరియస్ లేదా గ్రూప్ ఏ, బీ హీమోలైటిక్ స్టెఫలోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఇది పెద్దగా ప్రమాదకరం కాదు. (అయితే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది ప్రమాదకరం). యాంటీబాక్టీరియల్ పూత మందులు, వ్యాధినిరోధకతను పెంచే మందులతో దీనికి చికిత్స చేస్తారు.