ఎమ్మార్పీఎస్ ఇన్చార్జీల నియామకం
అనంతపురం న్యూటౌన్ : గ్రామీణ స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా గ్రామ, మండల నియోజక వర్గాలకు పార్లమెంటు, అసెంబ్లీ ఇన్చార్జీలను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు ఎంఎస్ రాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇన్చార్జీల వివరాలు వెల్లడించారు. అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జీలుగా చిన్నపెద్దన్న, కేఎల్ స్వామిదాసు, కణేకల్లు కష్ణ, హిందూపురం డివిజన్ ఇన్చార్జులుగా హనుమంతు, కుంటిమద్ది ఓబిలేసు, రంగనాథ్‌లను నియమించారు.
అసెంబ్లీ ఇన్చార్జిగా అనంతపురానికి రవికుమార్, గుంతకల్లుకు అంజనప్రసాద్, ఉరవకొండకు రామదాసు, నాగరాజు, శింగనమలకు కదిరెప్ప, వీరనారాయణ, వేణు, రాం పుల్లయ్య, రామయ్య, తాడిపత్రికి ఎస్వీ రమణ, మహేష్, రామాంజి, రాయదుర్గానికి కేసీ నాగరాజు, కొల్లయ్య, మహేష్, కల్యాణదుర్గానికి ఆంజనేయులు, విజయ్, నాగరాజు, పెనుకొండకు శ్రీనివాసులు, మడకశిరకు రఘురాం, పుట్టపర్తికి గోవింద, హిందూపురానికి ఆనంద్, నరసింహులు, మురళి, ధర్మవరానికి వెంకటేష్, హరి, రాప్తాడుకు జయప్రకాష్, రమణ, కదిరికి గంగిశెట్టి రజనీకాంత్‌ను నియమించినట్లు తెలిపారు.