ఆసుస్ 'అద్భుతమైన దీపావళి' ఆఫర్స్
ముంబై: బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేస్తున్న ఆసుస్ దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించింది. జెన్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు పై వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. 2016 అక్టోబర్ 18 నుంచి 22 వరకు అందుబాటులో ఉన్న తైవాన్ మొబైల్ మేకర్ ఆసుస్ 'ఇన్క్రెడిబుల్ దీపావళి' ఆఫర్లో 100 అదృష్టవంతులైన వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే మరో 100 మంది ఆసుస్ జోన్ పవర్ ను గెల్చుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ ను గెల్చుకోవాలంటే ఆసుస్ ఆథరైజ్డ్ పార్టనర్ షోరూంలలో జెన్ ఫోన్ 3 (ZE520KL ZE552KL) మోడల్ ఫోన్లు కొనుగోలు చేయాలి. అనంతరం కంపెనీకి చెందిన అధికారిక మైక్రోసైట్ లో లక్కీ డ్రా అనే ఆప్షన్ లో రిజిస్టర్ కావాలి. ఇన్ వోయిస్ నెంబరు, కొనుగోలు చేసిన స్థలం, డీలరు పేరు, తేదీ, ప్రొడక్ట్ సీరియల్ నెం. తదితర వివరాలను కచ్చితంగా పేర్కొనాలి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఆయా విజేతలకు వారి ఈమెయిల్ అడ్రస్ కు ముందుగా తెలియ చేస్తామని పేర్కొంది. గిఫ్ట్ వోచర్ కానీ, జెన్ పవర్ గానీ రిజిస్టర్ చేసుకున్న చిరునామాకు పంపిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ నవంబరు 20 కల్లా పూర్తి చేస్తామని, వారం రోజుల్లోగా ఇవి కస్టమర్ నమోదుచేసిన చిరునామాకు డెలివరీ చేయబడతాయని తెలిపింది. ఇలా రిజస్టర్ చేసుకోవడానికి నవంబరు 4వ తేదీ ఆఖరు తేదీ అని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ తమిళనాడు వాసులకు వర్తించదని స్పష్టం చేసింది.
నోట్బుక్ కొనుగోలుచేసిన వారికి 11వేల రూపాయ ఇతర బహుమతులు, గేమర్స్ కోసం రూ.10,600 గిఫ్ట్ లను అందించనుంది. దీంతో పాటుగా అన్ని ప్రధాన ఉత్పత్తులపై జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ లాంటి ఇతర ఆఫర్లను, బహుమతులను అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఆసుస్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.