‘బకాయిల వివరాలు తెలపండి’
కరాచీ: భారత క్రికెట్ బోర్డుకు ఏడు నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల మేరకు తాము బాకీ ఉన్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో వివరణతో పాటు పూర్తి వివరాలు అందించాల్సిందిగా పీసీబీ అధికారులు బీసీసీఐని కోరారు.
టెస్టు క్రికెట్ ఆడే చాలా సభ్య దేశాలు బోర్డుకు బకాయి పడ్డాయని, అందులో 2000-2001 నుంచి ఎనిమిది మిలియన్ డాలర్లు పాక్ బోర్డు చెల్లించాల్సి ఉందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ‘ఈ మొత్తం గురించి పూర్తి వివరాలు తెలపాల్సిందిగా బీసీసీఐకి లేఖ రాశాం. అయితే ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం రాలేదు. బహుశా ఇది ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా పీసీబీ తరఫున బీసీసీఐ ఖర్చు చేసిన మొత్తం కావచ్చు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.