'త్వరలో నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి విడుదల'
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు.
డిసెంబర్ 10లోగా హెలెన్, లెహర్ తుఫాన్ నష్ట తీవ్రతపై అంచనా నివేదికలను పంపాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను రఘువీరా రెడ్డి ఆదేశించారు. నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి రూ. 437 కోట్లు పెండింగ్లో ఉందని, రెండు రోజుల్లో ఆ సబ్సిడిని విడుదల చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు.