అనంతలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం : ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును అనంతపురం పోలీసులు బుధవారం రట్టు చేశారు. అనంతపురంలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల నగదుతోపాటు రూ. 12 లక్షల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.