international tennis federation tournament
-
పోరాడి ఓడిన రష్మిక జోడి
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. పెర్త్‌లో జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–3, 1–6, 7–10తో మిసాకి–నాహో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. సింగిల్స్‌లో రష్మిక తొలి రౌండ్లో 3–6, 3–6తో ఐవా డెస్టానీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలైంది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక, నిధి, సాత్విక
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, నిధి చిలుముల, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–1, 6–4తో హుమేరా బహార్మస్ (భారత్)పై, నిధి 4–6, 6–4, 10–6తో జెన్నిఫర్ ల్యుఖమ్ (భారత్)పై, సాత్విక 6–0, 6–1తో సౌమ్య (భారత్)పై, శ్రేయ 6–1, 6–2తో ఎలీనా (డెన్మార్క్)పై గెలిచారు. -
భువన, సౌజన్య ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు కాల్వ భువన, సౌజన్య భవిశెట్టి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ఆదివారం జరిగిన సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ మ్యాచ్ మధ్యలోనే వైదొలగడం గమనార్హం. ఆసియా జూనియర్ చాంపియన్ స్నేహదేవి రెడ్డి (భారత్)తో జరిగిన మ్యాచ్‌లో భువన స్కోరు 0-6, 3-3తో ఉన్న దశలో... కామోన్వన్ బుయామ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సౌజన్య స్కోరు 5-7, 2-3తో ఉన్న దశలో వైదొలిగారు. భారత్ నుంచి షర్మదా బాలూ, స్నేహదేవి రెడ్డి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.