నెట్లో చూసి.. నొప్పిలేకుండా టెకీ ఆత్మహత్య
ఇంటర్నెట్.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని విజ్ఞానానికీ వాడొచ్చు, వినాశనానికీ వాడొచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాన్ని ఏకంగా ఆత్మహత్యల కోసం కూడా వాడేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఓ పాతికేళ్ల వెబ్ ఇంజనీర్.. ఆన్లైన్లో కార్బన్ మోనాక్సైడ్ తెప్పించుకుని, దాన్ని పీల్చి ఏమాత్రం నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్న అతడు.. ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతో పాటు సిలిండర్ను కూడా కలిపి పెట్టుకుని, కింద మొత్తం గట్టిగా మూసేశాడు. అప్పటికే సిలిండర్ వాల్వు తెరిచి ఉంచడంతో అందులోంచి వచ్చిన గ్యాస్ పీల్చి.. నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలేశాడు.
అనుకోకుండా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపో్వడం సాధారణమేనని, కానీ.. ఇలా కావాలనే ఆ వాయువుతో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. అతడు నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకునే విధానాల కోసం ఇంటర్నెట్ గాలించినట్లు కూడా ఆ తర్వాత తెలిసింది. అద్దెకు తీసుకున్న ఫ్లాట్లోని బాత్రూంలో అతడి శవం పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు.
ఆ వాయువు ఎలా చంపుతుంది
కార్బన్ మోనాక్సైడ్ మనుషులను ఎలా చంపుతుందన్న విషయాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డాక్టర్ చిత్తరంజన్ బెహరా వివరించారు. ''వాసన, రంగు లేని.. ఏమాత్రం శారీరక ఇబ్బంది కలిగించని వాయువు. ఇది ఆక్సిజన్ కన్నా 200 రెట్లు ఎక్కువగా రక్తంలోని హెమోగ్లోబిన్తో కలిసిపోతుంది. రక్తంలోని ఆక్సిజన్ బదులు మొత్తం ఇది వ్యాపించి, చివరకు మెదడుకు కూడా ఆక్సిజన్ అందకుండాపోయి.. వెంటనే మరణం సంభవిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గాఢతతో ఈ వాయువు వ్యాపిస్తే.. చాలా తక్కువ సమయంలోనే ప్రాణం పోతుంది. ఈ కేసులో ఇలాగే జరిగింది'' అని ఆయన తెలిపారు.