ఆఫ్ఘాన్ లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ రచయిత్రి
కాబూల్: నిషేధిత మిలిటెంట్ల ఉన్మాదానికి ఓ భారతీయ రచయిత్రి అసువులు బాసింది. మిలిటెంట్ల రాక్షస క్రీడలో భారత్ కు చెందిన సుస్మితా బెనర్జీ ప్రాణాలు కోల్పయిన ఘటన గురువారం ఆఫ్ఘానిస్తాన్ లోని కాబూల్ లో సంభవించింది. గతంలో తాలిబన్ల దాడి నుంచి తప్పించుకున్న ఈమె.. మరోసారి ఆ తుపాకీ ధాటికి నేలకొరిగింది. సుస్మిత..1955లో తాలిబన్లు నుంచి ఎలా తప్పించుకున్న అంశాన్ని ఓ పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది. ఆ పుస్తకం భారత్ లో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకం ఆధారంగా 2003లో బాలీవుడ్ ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్ అనే సినిమాను నిర్మించారు.
భారత్ జాతికి చెందిన సుస్మిత.. ఆఫ్ఘాన్ స్థాన్ దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారిని పెళ్లాడి ఆక్కడే స్థిరపడిపోయింది. రచయిత్రగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ఆమె కొన్ని రోజులు భారత దేశంలోనే గడిపింది. గత కొన్నిరోజుల క్రితం ఆఫ్ఘాన్ లో తన భర్త జన్ బాజ్ ఖాన్ తో కలిసి జీవం సాగిస్తున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.