వరుణుడి కోసం ‘జడకొప్పు’
అమ్రబాద్: వరుణ దేవుడు కరుణించి వర్షం కురింపించాలని మండలంలోని జంగంగరెడ్డి రైతులు, మహిళలు పొడవాటి కర్రకు పగ్గాలు(తాళ్లు) చుట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు రామ భజనతో జడకొప్పు వేశారు. వర్షం కురిసే వరకు అల్లిన జడకొప్పు తొలగించమని ప్రతిన చేశారు. అదేవిధంగా స్థానిక ఆలయాల్లో విగ్రహాలను నీళ్లతో అభిశేకాలు చేశారు. పూజలు చేసి వర్షం కురిపించాలని మొక్కుకున్నారు.