దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో సోమవారం ఉదయం నిర్వహించిన కులధ్రువీకరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్, జోడు బసవన్న చౌక్ మహా ఈ-సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని ఆరో నంబరు పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిబిరాన్ని జనతా సహకార బ్యాంక్ చైర్మన్ జగదీష్ తుల్జాపూర్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాలకోసం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఎన్నోపాట్లు పడుతున్నారని, అయితే ఇటువంటి శిబిరాల నిర్వహణతో వారికి ఎంతో వె సులుబాటు లభించిందన్నారు. ఇక్కడ చదువుకున్న వారందరికీ ధువీకరణ పత్రాలు తప్పనిసరనే నిబంధనతో తెలుగువారంతా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇవి లభించడం కష్టంగా మారడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదన్నారు.
ఈ నిబంధనను మార్చాల్సిందిగా కొత్త ప్రభుత్వాన్ని కోరతామన్నారు.ఈ శిబిరానికి హాజరైన 127 మంది విద్యార్థులు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుహిని శెట్టి జ్ఞాతి సంస్థ అధ్యక్షుడు దీనానాథ్ దూళం, ఫౌండేషన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ కోండా, శ్రీధర్ సుంరా, రమణ పోటుబత్తి, నరేంద్ర దారా, శివదత్త్ కుని, ఆనంద్ బిర్రు, ఆనంద్ బిర్రు, నారాయణ ఎరువా తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సతీష్ చిటుమల్, శ్రీనివాస్ పోగులు, అర్చన పోతన, లక్ష్మీ బైరి, పూజానందాల్, శ్రీనివాస్ కామ్మూర్తి, సంతోష్ పోగుల తమవంతు సహకారం అందించారు.