Jalandharreddi
-
మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగుబాటు
సాక్షి, అమరావతి: గతంలో బలిమెలలో పోలీసులపై జరిగిన దాడి, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనల్లో పాత్రధారి, మావోయిస్టు కీలక నేత.. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ, మారన్న, కరుణ, శరత్ (40) మంగళవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. తెలం గాణలోని సిద్ధిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన జలంధర్‌రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ (ఏవోబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు హింసాయుత మార్గంలో ఏదీ సాధించ లేరని, జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయేవారికి చట్టపరంగా ఎటువం టి ఇబ్బందులు లేకుండా సహాయం అందించడంతోపాటు పునరావాసం కల్పిస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలు గిరిజనుల్లో కొత్త కాంతిని నింపుతు న్నాయని చెప్పారు. విప్లవం, నూతన ప్రజా స్వామ్యం అంటూ మావోయిస్టులు చేస్తున్న హింసా యుత కార్యకలాపాలపై గిరిజనులు, యువత తోపాటు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు పట్టు కోల్పో యారని, గత రెండేళ్లలో అనేక మంది లొంగి పోయారని వివరించారు. జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షలు నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని ఆయన పునరావాసానికి వినియోగిస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు.. అటవీ హక్కుల గుర్తింపు కింద 1.53 లక్షల మంది గిరిజనులకు 3.06 లక్షల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం పంచిపెట్టిందని డీజీపీ సవాంగ్ తెలిపారు. పలు సంక్షేమ పథకాల కింద గిరిజనులకు రూ.2,136 కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఐబీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఉద్యమానికి దూరం మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించలేకే ఉద్యమానికి దూరమైనట్టు జలంధర్‌రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాల పట్ల విభేదించానని తెలిపారు. పై స్థాయిలో పార్టీ చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు, తన ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగిపోయానన్నారు. ఆర్ఎస్యూ నుంచి సెంట్రల్ జోన్ సభ్యుడి స్థాయికి.. రిటైర్డ్ వీఆర్వో బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1998లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరిన జలంధర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిం చారు. 2000 ఫిబ్రవరిలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ పార్టీ సభ్యుడిగా గిరాయిపల్లి దళంలో చేరారు. 2000 సెప్టెంబర్ నుంచి 2002 ఆగçస్టు వరకు నల్లమల ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్, ఆంధ్ర ప్రాంత ప్లాటూన్ లలో పనిచేశారు. 2002 సెప్టెంబర్‌లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీలో ఈస్ట్ డివిజనల్ కమిటీ, మల్కన్‌గిరి– కోరాపుట్–విశాఖ బోర్డర్ కమిటీల్లో డివిజన్ కార్యదర్శి, కమాండర్‌గా పనిచేశారు. 2006 నవంబర్‌లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 నుంచి 2016 వరకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ స్క్వాడ్ కార్యదర్శిగా పనిచేశారు. 2019 అక్టోబర్ నుంచి ఏవోబీ ఎస్జెడ్సీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2008లో గ్రేహౌండ్స్ పోలీసులపై జరిగిన బలిమెల దాడి, 2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనలు జలంధర్‌రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. బలిమెల దాడిలో రెండో అస్సాల్ట్ టీమ్‌కు నాయకత్వం వహించారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ఐదు ప్రధాన దాడులు, 19 ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. 2004 ఫిబ్రవరి 6న కోరాఫుట్ జిల్లా ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌పై దాడిలోనూ ఉన్నారు. 2001 మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. -
ప్రజాసేవ చేయడమే లక్ష్యం..
సాక్షి, మక్తల్: నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలన్నదే తమ ధ్యేయమని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలందర్‌రెడ్డి అన్నారు. మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో దాసర్పల్లి, బోందల్‌కుంట, గ్రామాలకు చెందిన పార్టీ వార్డు సభ్యుడు డైరెక్టర్లు, వివిధ నాయకులు దాదాపు 300 మంది కార్యకర్తలతో బారీగా చేరారు. మొదటగా మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణను జలందర్‌రెడ్డి శాలువాతో ఆవ్వానించి సన్మానం చేశారు. పట్టణంలో జలందర్‌రెడ్డి ప్రచారం చేశారు.అందరూ ట్రాక్టరు గుర్తు రావడంతో అందరి అశీర్వాదమేనని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అక్కల సత్యనారాయణ మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. తాగునీటి వసతి, రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వార్డు సభ్యులు గొల్లపల్లి నారాయణ, సత్యనారాయణగౌడ్, హన్మంతు, రవికుమార్,బాలప్ప, కట్టవెంకటేస్, యూనిష్ లక్ష్మారెడ్డి, రాజుల ఆశిరెడ్డి, సూర్యనారాయణ, నీలప్ప, రంజిత్‌రెడ్డి, వెంకటేష్, మల్లేష్, మామిళ్ల ఆంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. జలంధర్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ నర్వ: నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌రెడ్డికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని బంగ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. నర్వలో నిర్వహించిన ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీవెంకటయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఆచారి ఆయనకు మద్దతు తెలిపారు. రజక సంఘం మండల అధ్యక్షుడు తమ మద్దతు తెలిపారు. రైతు నేస్తం ట్రాక్టర్ గుర్తు రావడంతో జలంధర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, సంధ్య అయ్యన్న, ఆంజనేయులు, నాగిరెడ్డి, హన్మంతురెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఫజల్, రజక సంఘం బొజ్జన్న, యాంకి వెంకటేష్, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్వ: మద్దతును ప్రకటిస్తున్న జెడ్పీటీసీ, విశ్వభ్రాహ్మణ, రజక సంఘం నాయకులు -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
భానుపురి, న్యూస్‌లైన్ :క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలైంది. వ్యవసాయ భూమి టైటిల్ డీడ్ పుస్తకాల విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఓ గ్రామ రెవెన్యూ అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు చిక్కాడు. వివరాలు. నూతన్‌కల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన తిరుక్కవల్లూరు శ్రీనివాస్ మోతె మండలం సిరికొండ వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ముదిగొండ జలంధర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట 6.27 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాస్‌పుస్తకాలను జలంధర్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారుల చేత చేయించుకున్నాడు. టైటిల్‌డీడ్ పుస్తకాల కోసం గ్రామ వీఆర్ఓ శ్రీనివాస్‌ను సంప్రదించాడు. వాటి కోసం వీఆర్ఓ శ్రీని వాస్ రూ.5వేలు డిమాండ్ చేశాడు. 15 నెలలుగా జలంధర్‌రెడ్డి టైటిల్డీడ్ల కోసం వీఆర్ఓ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో చేసేదిలేక జలంధర్‌రెడ్డి రూ.3వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. టైటిల్డీడ్లు ఇచ్చేందుకు ఇబ్బందులకు గురిచేసిన వీఆర్ఓను ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టిం చాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల వారిని సంప్రదించాడు. అందులో భాగంగా అధికారులు జలంధర్‌రెడ్డి మంగళవారం వీఆర్ఓ శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఉదయం శ్రీనివాస్ పట్టణంలోని బాలాజీనగర్‌లో అద్దెకు నివాసముండే అతని ఇంటికి వెళ్లి జలంధర్‌రెడ్డి రూ.500ల నోట్లు రూ.3వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే ఇంట్లోకి వెళ్లి జలంధర్‌రెడ్డి ఇచ్చిన డబ్బులను వీఆర్ఓ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీఆర్వోను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, నల్లగొండ, హైదరాబాద్ ఏసీబీ ఇన్స్పెక్టర్లు ముత్తిలింగం, వెంకటరెడ్డి, ఏఎస్ఐ పాండు, సుధాకర్, జానీ, శ్రీకాంత్ ఉన్నారు. ప్రతి పనికి సప‘రేటు’ మోతె: ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్ఓ శ్రీనివాస్ అవినీతి బాగోతం అంతా ఇంతా కాదని రైతులు పేర్కొం టున్నారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ ముక్కుపిండి వసూలు చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. భాగ పంపిణీ, టైటిల్‌డీడ్, పౌతి, ఆర్వోఆర్ కింద పట్టాలు తయారు చేయాలన్నా చేయి తడిపితే కానీ పని చేయడని రైతులు చెబుతున్నారు. ఈ తతంగం ఎవరి కైనా చెపితే వారి ఫైల్ ముందుకు కదలదని బెదిరించే వాడని తెలిసింది.