'బాలింతల కోసమే రైళ్లలో జననీ సేవా'
ఢిల్లీ: రైళ్లలో జననీసేవా కార్యక్రమాన్ని బుధవారం రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. బాలింతలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే జననీ సేవా కార్యక్రమం చేపట్టినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 25 స్టేషన్లలో వేడిపాలు, నీళ్లు అందుబాటులోకి రైల్వేశాఖ తెచ్చినట్టు తెలిపారు.
అంతేకాక ఐదు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల చిన్నారుల వరకు ప్రత్యేక మెను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాజధాని, శతాబ్ది రైలు టిక్కెట్లలో ఆహార నిబంధన సడలింపు తప్పనిసరి చేసినట్టు సురేష్ ప్రభు పేర్కొన్నారు.