యువతి అనుమానాస్పద మృతి
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో దారుణం వెలుగుచూసింది. స్థానిక జయశంకర్ పార్క్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆదివారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు రాజీవ్‌నగర్‌కు చెందిన బానోతు అమల(19)గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.