మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ విధానం
కరీంనగర్‌అగ్రికల్చర్: వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో త్వరలో ఆన్లైన్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(నామ్) అనుసం«ధిస్తామని మార్కెటింగ్ శాఖ జేడీ వి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం కరీంనగర్ మార్కెట యార్డులో జాతీయ వ్యవసాయ మార్కెట్ల విధానంపై వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా ఎంపిక చేసిన మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ డాటా ఎంట్రీ (రైతుల వివరాలు) కూడా ప్రారంభిస్తామన్నారు. నామ్ విధానంతో వ్యాపారస్తుల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మావతి, ఏడీఎం ప్రకాశ్, సూపర్వైజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.