రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్లో నివాసముంటున్నాడు. రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మిర్యాలగూడ పట్టణంలోని జీవీ ఆసుపత్రి వద్ద విషం తాగి కారులోనే ఉండి లాక్ చేసుకున్నాడు. శ్రీనివాస్ అపస్మారకస్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.