గాలింపు ముమ్మరం
వేలూరు డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయిన జార్ఖండ్ బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వేలూరు, న్యూస్‌లైన్: జార్ఖండ్ రాష్ట్రం కిరిడి జిల్లాకు చెందిన ప్రియాంక(14) తన తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ, బంధువులతో వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చింది. సోమవారం సాయంత్రం భారీ వర్షపు నీటి ప్రవాహంలో నడుస్తూ డ్రైనేజి కాలువలో కొట్టుకుపోరుుంది. అప్పటి నుంచి కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కార్పొరేషన్‌లోని డ్రైనేజీ కాలువలు ఎక్కడికక్కడ తవ్వేసినా ప్రియాంక ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో వేలూరు ప్యాలెస్ క్యాప్ ఎదురుగా వున్న కొన్ని కట్టడాలను ప్రొక్లెయినర్లతో కూల్చేస్తున్నారు. అదే విధంగా సీఎంసీ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న కర్పగం సూపర్ మార్కెట్‌ను ధ్వంసం చేసి వాటి కింద ఉన్న డ్రైనేజీ కాలువను పరిశీలించారు.
ఆక్సిజన్ మాస్క్‌తో: సీఎంసీ ఆస్పత్రి నుంచి తోటపాళెం వరకు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులను డ్రైనేజీ కాలువ లో దింపి కాలువలోపల ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని లోజర్ దీపాలను తలకు కట్టుకొని అధునూతన టార్చ్లైట్లను వేసికొని గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా ఆర్కాడు రోడ్డు, సీఎంసీ సిగ్నిల్, జంక్షన్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, కమిషనర్ జానకి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు వెతికి, వెతికి అలసిపోరుు ఇక తమవల్ల కాదని చెప్పేశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలు చర్చించుకొని అరక్కొణంలోని నావికాదళం సిబ్బందిని గాలింపు చర్యలకు రప్పించారు.
అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాళీ నావికాదళం సైనికులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో వేలూరు చేరుకొని బేరి సుబ్రమణ్యయార్ వీధిని పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ కాలువ ఎంత దూరం వెళుతుంది. ఎక్కడెక్కడ కాలువ ముగుస్తుందనే విషయాలను పరిశీలించి వాటిని అధునాతన కెమెరాల ద్వారా ఫొటోలు తీసుకొని ఆ టీమ్ సభ్యులతో చర్చలు జరిపారు. రాత్రి కావడంతో పాటు విద్యుత్ సరఫరా లేక పోవడంతో గాలింపు చర్యలను కొనసాగించలేకపోయూరు. బుధవారం ఉదయం 6 గంటలకు కమాండర్ అర్జునన్ అధ్యక్షతన 10 మంది సిబ్బంది గాలింపు చర్యల్లోకి దిగారు. సీఎంసీ నుంచి కాలువలను కలెక్టరేట్ వరకు గాలించా రు. అదే విధంగా డ్రైనేజీ కాలువలోని మట్టిని కూడా పరిశీలించారు. కాలువల మ్యాప్ సక్రమంగా లేకపోవడంతో కాలువలు ఎక్కెడెక్కడ వెళుతున్నాయనే విషయాలను అధికారులు పూర్తి నిర్ధారణ చేయలేక పోతున్నారు.
డ్రైనేజీ కాలువలపైనే భవనాల నిర్మాణం
కార్పొరేషన్ వ్యాప్తంగా డ్రైనేజీ కాలువలపైనే అక్రమంగా కట్టడాలను నిర్మించడంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారారుు. అసలు కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపించకపోవడం గమనార్హం. ఇన్ని రోజులుగా ఆక్రమణలను పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం బాలిక కొట్టుకుపోయిన తరువాత డ్రైనేజీ కాలువల దుస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు.
స్తంభించిపోరుున వేలూరు
బాలిక కొట్టుకుపోయిన సంఘటనతో వేలూరును స్తంభింప జేసింది. పట్టణ నడిబొడ్డున ప్రియాంక గల్లంతు కావడంతో కాట్పాడి రోడ్డు, పాత బస్టాండ్, సీఎంసీ రోడ్డులో డ్రైనేజీ కాలువలను తవ్వి ఆ మట్టిని రోడ్డుపైన వేయడంతో రాకపోకలు స్తంభించిపోయూరుు.
కన్నీరు, మున్నీరు
ఎంత గాలించినా ప్రియూంక ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరవుతున్నారు. క ళ్ల ఎదుటే తన చెల్లెలు కాలువలో కొట్టుకుపోతుంటే కాపాడలేక పోయానని ప్రియాంక అన్న అయూద్ విలపించాడు.