జర్నలిస్టుల ఉచిత విద్య అమలుకు ప్రత్యేక సెల్
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని అక్రిడేటేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను శనివారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలులో ఎక్కడా సమస్యలు తలెత్తకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఈ సెల్లో ఫిర్యాదు చేయవచ్చని జర్నలిస్టులకు సూచించారు.
ఈ విషయంలో డీఈఓ, ఆర్ఐఓతో తరచూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రత్యేక విభాగానికి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.