వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త