తల్లి మరణంతో గుండెపగిలి....
రంగారెడ్డి(చేవెళ్ల): గోరు ముద్దలు తినిపించి అల్లారుముద్దుగా పెంచిన తల్లి కాలధర్మం చేసి చనిపోతే అప్పటివరకు తల్లే దైవంగా జీవించిన కొడుకు కూడా తల్లి దారినే నడిచి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయవిదారక సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడెంలో మంగళవారం రాత్రి జరిగింది.
గ్రామానకి చెందిన కల్లెంల గాలెమ్మ(75) రెండు రోజుల కిందటే అనారోగ్యంతో మృతిచెందింది. మంగళవారం ఆమే అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన ఆమె కొడుకు కల్లెంట నారాయణ(55) గుండెపోటుతో మృతిచెందాడు. రెండురోజుల్లో రెండు చావులు చూసిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.