ప్రజల వద్దకు ముఖ్యమంత్రి
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్ ఖిల్లాకి రావడం, నగరంలోని మురికివాడలు గల కాలనీ లలోకి స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమ స్యలను తెలుసుకోవడం, అధికారులకు చివాట్లు పెట్టడం, సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్ట డం అభినందనీయం. వివిధ నియోజకవర్గాల పరి ధిలో గల కాలనీలను సందర్శించి వారి బాగో గులు తెలుసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అవినీతి అధికారుల సమాచా రం తెలపాలంటూ ప్రజలందరికీ టోల్‌ఫ్రీ నంబర్ ఇవ్వ డం, ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.
గతంలో ఏ సీఎం పర్యటించని విధంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించిన కేసీఆర్‌కు అభినందనలు.
కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా