25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు టౌన్: మైదుకూరు మండలం వనిపెంట ఫారెస్ట్ పరిధిలోని కండ్రగుండలు సమీపంలో ఆదివారం రాత్రి వనిపెంట రేంజ్ అధికారి స్వామివివేకానంద దాడులు నిర్వహించి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వామి వివేకానంద తెలిపిన వివరాల మేరకు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో ట్రాక్టర్‌తో పాటు 25 దుంగలను స్వాధీనం చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ బండి కిషోర్‌ను అరెస్ట్ చేశామన్నారు. మరికొంతమంది నిందితులు పరారైనట్లు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.