జేసీపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం!
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటి చైర్మన్ కంతేటీ సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... జేసీ ఏఐసీసీ సభ్యుడైనప్పటికి ఆయనపై చర్య తీసుకునే అధికారం పీసీసీకి ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎలాంటి నేతలపైన అయిన చర్యలు తీసుకునే అధికారం పీసీసీకి ఉందని కంతేటీ సత్యనారాయణ గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియాపై జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే కమిటీ క్రమశిక్షణా సంఘం సమావేశమైందని తెలిపారు. అయితే ఆ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు కంతేటి సత్యనారాయణ నిరాకరించారు.