గ్యాస్ పేలుళ్లు : 15 మంది మృతి
తైపీ: తైవాన్ కోషియంగ్ నగరంలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో 15 మంది మరణించారు. 233 మంది గాయపడ్డారని నగర మేయర్ చెన్ చు వెల్లడించారు. మృతుల్లో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గ్యాస్ పేలుడు వల్ల ఆ పక్కనే ఉన్న నివాసాలకు మంటలు వ్యాపించాయని... దాంతో అగ్నికీలలు భారీగా ఎగసి పడ్డాయని చెప్పారు.
మంటలార్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ మంటలకు ఆహుతి అయ్యారని వివరించారు. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఆ దుర్ఘటనలో సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దశాబ్ద కాలంలో జరిగిన అత్యంత దారుణ సంఘటన అని చెన్ అన్నారు.