తొగాడియాను కర్ణాటకలో కాలు పెట్టనివ్వం
కర్ణాటక హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడి
బెంగళూరు : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా విశ్వహిందూపరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాను కర్ణాటకలో అడుగుపెట్టనివ్వబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ప్రసంగాలను అనుమతించబోమని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ స్పష్టం చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పుత్తూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ప్రవీణ్ తొగాడియా పాల్గొని ప్రసంగించారని, అనంతరం ఆయా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మరే ప్రాంతంలోనూ ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించాల్సి వస్తోందని, ఇందులో మరే దురుద్దేశం లేదని అన్నారు.
జర్మనీలోని ఓ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధికి ‘అత్యాచారాల దేశం’ నుంచి వచ్చిన వారంటూ గుర్తింపువేసి ఇంటర్న్‌షిప్‌లో చేర్చుకునేందుకు నిరాకరించడం బాధాకరమని అన్నారు.