భక్తురాలిపై అసభ్య ప్రవర్తన
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తురాలిపై ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి అంతర్గత విచారణ చేపట్టారు.